జవహర్‌లాల్ నెహ్రూ కారు డ్రైవర్ మోనప్పగౌడ కన్నుమూత
- 102 సంవత్సరాల వయసులో కన్నుమూసిన మోనప్పగౌడ
- స్వాతంత్ర్య సంగ్రామంలోనూ పాల్గొన్న మోనప్ప
- మోనప్ప డ్రైవింగ్ స్కిల్స్‌కు ముగ్ధుడై తన కారు డ్రైవర్‌గా నియమించుకున్న నెహ్రూ
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కారు డ్రైవర్, స్వాతంత్ర్య సమరయోధుడు మోనప్పగౌడ కోరంబడ్క కన్నుమూశారు. ఆయన వయసు 102 సంవత్సరాలు. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కర్ణాటకలోని కనకమాజుల గ్రామంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు వెంకటరమణ, ముగ్గురు కుమార్తెలు కమల, విమల, కుసుమ ఉన్నారు.
స్వాతంత్ర్య సమరంలో నెహ్రూకు సాయం చేసిన ఆయన ఆ తర్వాత నెహ్రూ కారు డ్రైవర్‌గానూ పనిచేశారు. అలాగే, నవలా రచయిత శివరామ్ కరంత్, మాజీ ఎంపీ శ్రీనివాస్ మాల్యా, మాజీ ముఖ్యమంత్రి కెంగల్ హనుమంతయ్య వద్ద కూడా కారు డ్రైవర్‌గా పనిచేశారు. తాజ్ హోటల్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పుడు మంగళూరు విమానాశ్రయం నుంచి నెహ్రూను పికప్ చేసుకుని వచ్చారు. ఆయన డ్రైవింగ్ నైపుణ్యానికి ముగ్ధుడైన నెహ్రూ తన కారు డ్రైవర్‌గా ఆయనను నియమించుకున్నారు.