ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా దవళేశ్వరం ప్రాజెక్టుకు గుర్తింపు
- ఆస్ట్రేలియాలో సాగు, నీటిపారుదలపై అంతర్జాతీయ సదస్సు
- ఏపీ నుంచి హాజరైన మంత్రులు అంబటి, కాకాణి
- దవళేశ్వరానికి దక్కిన అవార్డును అందుకున్న మంత్రులు
గోదావరి నదిపై ఏపీలో నిర్మించిన దవళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ఈ ప్రాజెక్టు గుర్తింపు పొందింది. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఓ కీలక ప్రకటన వెలువడింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, నీటిపారుదల రంగాలపై ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ ఆధ్వర్యంలో ఆడిలైడ్‌లో అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ సదస్సుకు ఏపీ నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలు హాజరయ్యారు. సదస్సులో భాగంగా గురువారం దవళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు దవళేశ్వరం ప్రాజెక్టుకు దక్కిన అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అంబటి, కాకాణి అందుకున్నారు.