సీఐడీ పోలీసులు నా కుమార్తెను బెదిరించారు... నా డ్రైవర్‌ను కొట్టారు: చింతకాయల విజయ్
- ఇటీవలే హైదరాబాద్‌లోని విజయ్ ఇంటికి వెళ్లిన సీఐడీ పోలీసులు
- నోటీసులపై విజయ్ లేఖతో సీఐడీ కార్యాలయానికి వెళ్లిన ఆయన తరఫు లాయర్లు
- లేఖను తీసుకునేందుకు అధికారుల నిరాకరణ
- సీఐడీ అధికారులు తన ఇంటిలోకి అక్రమంగా చొరబడ్డారన్న విజయ్
ఏపీ సీఐడీ పోలీసులపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కేసు ఏమిటో చెప్పకుండా విచారణకు రమ్మంటే ఎలా వెళతామంటూ విజయ్ అన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోని విజయ్ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన ఇంటిలో లేకపోవడంతో ఇంటిలో విజయ్ డ్రైవర్‌కు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ ఇంటిలో సీఐడీ అధికారుల తీరుపై విజయ్‌తో పాటు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా సీఐడీ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెబుతూ విజయ్ ఓ లేఖ రాశారు. సదరు లేఖను తీసుకుని ఆయన తరఫు న్యాయవాదులు గుంటూరులోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా విజయ్ లేఖను తీసుకునేందుకు సీఐడీ అధికారులు నిరాకరించగా... లేఖను సీఐడీ కార్యాలయంలోని తపాలా విభాగానికి అందజేశారు. విజయ్‌కు సీఐడీ ఇచ్చిన నోటీసులు అసలు చెల్లుబాటు కావని ఈ సందర్భంగా విజయ్ తరఫు న్యాయవాదులు తెలిపారు. నిందితుడికి గానీ, నిందితుడి కుటుంబ సభ్యులకు ఇచ్చే నోటీసులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని వారు తెలిపారు. విజయ్ డ్రైవర్‌కు ఇచ్చిన నోటీసులు చెల్లవని వారు అన్నారు.
ఈ వ్యవహారంపై విజయ్ కూడా స్పందించారు. సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో ఎలాంటి వివరాలు లేవని ఆయన అన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ, క్రిమినల్ కేసుల వివరాలను సీఐడీ అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఐడీ అధికారులు తన ఇంటిలోకి అక్రమంగా చొరబడ్డారని ఆయన ఆరోపించారు. తన కుమార్తెను బెదిరించారని, తన డ్రైవర్‌ను కొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.