మనం చెప్పలేని దాన్ని గుండె చప్పుడు చెపుతుంది: చిరంజీవి
- దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి
- దత్తాత్రేయ గారు ఇంటికి వచ్చి పిలిచారన్న మెగాస్టార్
- ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరగాలన్న చిరు
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమానికి సినీ నటుడు చిరంజీవి హాజరయ్యారు. ఆ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... అలయ్ బలయ్ అనేది తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఉందని చెప్పారు. గతంలో ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్, అల్లు అరవింద్ హాజరయ్యారని... తాను కూడా హాజరు కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని... ఇప్పటికి అది సాధ్యమయిందని తెలిపారు.
బండారు దత్తాత్రేయ గారు తన ఇంటికి వచ్చి తనను ఆహ్వానించారని చెప్పారు. అలయ్ బలయ్ కార్యక్రమం ఒక ఉన్నతమైన కార్యక్రమం అని... దీనికి దత్తాత్రేయ గారు విశేషమైన ప్రాచుర్యాన్ని కల్పించారని చిరంజీవి కొనియాడారు. ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పంచే అద్భుతమైన కార్యక్రమమని చెప్పారు. ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరగాలని అన్నారు. మనం చెప్పలేని దాన్ని గుండె చప్పుడు చెపుతుందని... మాటకు లొంగని వ్యక్తి కూడా హృదయ స్పందనకు లొంగుతాడని చెప్పారు.