అజా సమయంలో ప్రసంగం ఆపి కశ్మీరీ మనసులను గెలుచుకున్న షా

  • బారాముల్లాలో బహిరంగ సభలో పాల్గొన్న హోంమంత్రి
  • మధ్యలో సమీపంలోని మసీదు నుంచి మొదలైన అజా
  • అది విని ప్రసంగానికి బ్రేక్ ఇచ్చిన అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కశ్మీరీల మనసులను గెలుచుకున్నారు. అది కూడా ఓ చిన్న పనితో. బుధవారం బారాముల్లాలో బహిరంగ సభలో షా పాల్గొన్నారు. ఆ సమయంలో సమీపంలోని మసీదు నుంచి అజా (ప్రార్థన) ప్రారంభమైంది. ఇది విన్న అమిత్ షా మసీదులో ఏదైనా జరుగుతోందా? అని అడిగి తెలుసుకున్నారు. ప్రార్థన జరుగుతున్నట్టు అక్కడి వారు చెప్పారు. దీంతో తన ప్రసంగాన్ని అమిత్ షా నిలిపివేశారు. అది కూడా సభకు హాజరైన ప్రజల అనుమతితోనే చేశారు. మసీదు నుంచి అజా నిలిచిపోయిన తర్వాత అమిత్ షా తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

అమిత్ షా చేసిన పని ఎంతో మంది హృదయాలను తాకింది. అజా కారణంగా గౌరవ హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేయడం గొప్ప చర్య. కశ్మీరీల హృదయాలను గెలుచుకుంది. కశ్మీరీల మనోభావాలు, ఈ ప్రాంతానికి ఇస్తున్న గౌరవాన్ని ఇది తెలియజేస్తుంది’’అంటూ ట్విట్టర్ లో ఓ యూజర్ పోస్ట్ పెట్టడం గమనార్హం. 

ప్రధానమంత్రి నాయకత్వంలో కశ్మీరీ ప్రజలు శాంతి, ప్రగతి, పురోగతి దిశగా కొత్త శకాన్ని చూస్తున్నారంటూ హోంమంత్రి అమిత్ షా సైతం ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. జమ్మూకశ్మీర్ శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. 



More Telugu News