దుబాయ్ లో అద్భుతమైన హిందూ దేవాలయం.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ఇదిగో
- ట్విట్టర్ లో వీడియో పెట్టిన ఆనంద్ మహీంద్రా.. ‘అత్యద్భుతం’ అంటూ క్యాప్షన్
- దుబాయ్ సమీపంలోని జబెల్ ఆలీ ప్రాంతంలో ప్రత్యేకంగా ‘వర్షిప్ విలేజ్’
- అందులో భారీ దేవాలయంతో పాటు ఏడు చర్చీలు, ఒక గురుద్వారా ఏర్పాటు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో భాగమైన దుబాయ్ లో నిర్మించిన ఓ హిందూ ఆలయాన్ని ఇటీవల ప్రారంభించారు. దుబాయ్ లోని ఎమిరేట్స్ ‘వర్షిప్ విలేజ్’లో భారతీయ, అరబిక్ నిర్మాణ శైలులను మేళవించి ఈ ఆలయాన్ని నిర్మించారు. శివుడు పార్వతుల నుంచి విష్ణుమూర్తి, బ్రహ్మ, కృష్ణుడు, ఇతర దేవతా మూర్తుల అవతారాలను ఈ ఆలయంలో ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో..
ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో..
- ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ ఆలయానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి ‘అత్యద్భుతం’ అని క్యాప్షన్ పెట్టారు. తాను త్వరలో దుబాయ్ వెళ్లనున్నానని, ఆ సమయంలో తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్భిస్తానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
- ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పూజారులు ‘ఓం శాంతి శాంతి ఓం’ అని మంత్రాలు చదువుతుండగా.. భారతీయ తబలా, ఇతర వాయిద్యాలు మోగుతూ అలరిస్తున్నాయి.
- దుబాయ్ సమీపంలోని జెబెల్ అలీలో ఉన్న ఈ వర్షిప్ విలేజ్ లో ఒక పెద్ద దేవాలయంతోపాటు ఏడు చర్చిలు, ఒక గురుద్వారా ఉన్నాయి. మొత్తంగా 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ వర్షిప్ విలేజ్ ను నిర్మించారు.