తిరుమలలో ముగిసిన బ్రహ్మోత్సవాలు... శాస్త్రోక్తంగా సాగిన ధ్వజావరోహణం
- 9 రోజుల పాటు వేడుకగా సాగిన బ్రహ్మోత్సవాలు
- బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిసిన ఉత్సవాలు
- భారీ సంఖ్యలో హాజరైన భక్త గణం
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై గడచిన 9 రోజులుగా వేడుకగా సాగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ముగిశాయి. బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా సాగిన ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఏకాంతంగానే స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగగా... కరోనా విస్తృతి తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల మధ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగాయి
రెండేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూడలేకపోయిన వెంకన్న భక్త గణం ఈ ఏడాది జరిగిన బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేసిన టీటీడీ అందుకనుగుణంగానే ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల నిర్వహణ ఎలాంటి విఘ్నాలు లేకుండానే పూర్తి అయ్యాయి.