హైదరాబాద్‌ను కోల్పోయి అనాథలమయ్యాం... మళ్లీ ఆ తరహా పరిస్థితి వద్దు: కొడాలి నాని
- వేమవరం కొండాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన నాని
- అమరావతి ఉద్యమాన్ని దేవుళ్లు కూడా హర్షించరని వ్యాఖ్య
- రాయలసీమ, ఉత్తరాంధ్రల కోసమే 3 రాజధానుల నిర్ణయమని వెల్లడి
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయంపై ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని బుధవారం మరోమారు స్పందించారు. దసరా పర్వదినాన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని కొండాలమ్మ అమ్మ వారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలంటూ మొక్కుకున్నానని ఆయన తెలిపారు.
రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నామని నాని తెలిపారు. అమరావతి ఉద్యమాన్ని ప్రజలతో పాటు దేవుళ్లు కూడా హర్షించరని ఆయన వ్యాఖ్యానించారు. కులాలు, పార్టీల కోసమో కాకుండా... రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయరాదన్న భావనతోనే సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్ర సంపద అంతా ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను కోల్పోయి అనాథలమయ్యామన్న నాని... శ్రమ అంతా అమరావతిపైనే పెడితే మళ్లీ అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అన్నారు.