కేసీఆర్ కు తెలంగాణతో సంబంధం తెగిపోయింది: ఈటల రాజేందర్

కేసీఆర్ కు తెలంగాణతో సంబంధం తెగిపోయింది: ఈటల రాజేందర్
  • ఉద్యమ పార్టీని కేసీఆర్ ఖతం చేశారు
  • ఉద్యమకారులను కూడా మర్చిపోయేలా కొత్త పార్టీని స్థాపించారు
  •  అక్రమ సంపాదనతో దేశ రాజకీయాలను నడపాలనుకుంటున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కీలక పరిణామంపై టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో విపక్షాలు మాత్రం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ స్థాపనతో తెలంగాణతో కేసీఆర్ కు సంబంధం తెగిపోయిందని అన్నారు. టీఆర్ఎస్ తో తెలంగాణ ప్రజానీకానికి ఉన్న అనుబంధం ముగిసిపోయిందని చెప్పారు. 

తెలంగాణ సాధన కోసం వచ్చిన ఉద్యమ పార్టీని కేసీఆర్ ఖతం చేశారని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమకారులను కూడా మర్చిపోయేలా, పూర్తిగా కేసీఆర్ ముద్ర మాత్రమే ఉండేలా పార్టీని స్థాపించారని విమర్శించారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయాలను నడపాలని పగటి కలలు కంటున్నారని దుయ్యబట్టారు. కూట్లో రాయి తీయలేనోడు... ఏట్లో రాయి తీయడానికి పోయినట్టుందని అన్నారు.


More Telugu News