నా జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం అదే: బిల్ గేట్స్ మాజీ భార్య
- మూడు దశాబ్దాల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన బిల్ గేట్స్, మిలిందా
- బిల్ గేట్స్ తో విడిపోయిన క్షణం తన జీవితంలో అత్యంత బాధాకరం అన్న మిలిందా
- తమ ఫౌండేషన్ కోసం ఇద్దరం కలిసే పనిచేస్తామన్న మిలిందా
దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక జీవితానికి దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ ముగింపు పలికిన సంగతి తెలిసిందే. 2021 మే నెలలో వారు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. వారిద్దరూ విడిపోయినప్పటికీ తమ ఫౌండేషన్ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కోసం కలిసి పని చేస్తామని ప్రకటించారు. తాజాగా ఫార్చ్యూన్ మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిలిందా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిల్ గేట్స్ నుంచి విడిపోయిన క్షణం తన జీవితంలోనే అత్యంత బాధాకరమైనదని మిలిందా తెలిపారు. తామిద్దరం విడిపోతామని తాను ఎప్పుడూ ఊహించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము వైవాహిక జీవితంలో కొనసాగలేకపోవడానికి తనకు కొన్ని కారణాలు ఉన్నాయని మిలిందా చెప్పారు. తాను తనలా స్వేచ్ఛగా బతికేందుకు అవసరమైన వేదికను కరోనా సమయం తనకు కల్పించిందని తెలిపారు. బిల్ తో విడిపోవడం ఎంతో బాధాకరం అయినప్పటికీ... ధైర్యంగా ముందుకు సాగడానికి అవసరమైన స్థైర్యం తనలో ఉందని చెప్పారు.
బిల్ గేట్స్ తో విడిపోయినప్పటికీ... ప్రతి రోజు ఆయనతో కలిసి సమాజ సేవ చేస్తానని మిలిందా తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో తాను ఏడుస్తూ ఉన్నప్పటికీ... 10 గంటల సమయంలో తాను ఎన్నో ఏళ్లుగా కలిసి బతికిన వ్యక్తి (బిల్ గేట్స్)తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతానని... తాను ఏం చేయగలనో చెపుతానని అన్నారు. 1994లో బిల్ గేట్స్, మిలింద్ పెళ్లి చేసుకున్నారు. వీరికి జెన్నిఫర్, రోరీ, ఫోబే అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.