ఆయుధ పూజ చేసి తెలంగాణ భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్
- ఆయన వెంట కుమారస్వామి, తిరుమాళవన్
- ఘన స్వాగతం పలికిన టీఆర్ఎస్ శ్రేణులు
- మొదలైన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం
నూతన జాతీయ పార్టీ ప్రకటన కోసం టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. జేడీఎస్ నేత కుమారస్వామి, వీసీకే అధినేత తిరుమాళవన్, పలువురు ప్రతినిధులతో కలిసి వచ్చిన సీఎం కేసీఆర్ కు తెలంగాణ భవన్ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. విగ్రహానికి పుష్పాంజలి ఘటించి స్మరించుకున్నారు. కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీపై తీర్మానం చేయనున్నారు.
అనంతరం జరిగే మీడియా సమావేశంలో కేసీఆర్ జాతీయ పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, తెలంగాణ భవన్ బయల్దేరే ముందు దసరా సందర్భంగా కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన సీఎం కేసీఆర్ పరస్పర శుభాకాంక్షలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆయుధ పూజ నిర్వహించారు.