మనసు మార్చుకున్న మస్క్.. ట్విట్టర్ కొనుగోలు డీల్ పూర్తి చేయాలని నిర్ణయం
- ఏప్రిల్‌లో ట్విట్టర్ మొత్తాన్ని కొంటానని ప్రకటించిన టెస్లా అధినేత
- ఒక్కో షేరుకు 54.20 డాలర్లు ఇస్తానని చెప్పి, తర్వాత వెనక్కి తగ్గిన ఎలన్ మస్క్
- తాజాగా అదే ధరకు డీల్ పూర్తి చేద్దామని ట్విట్టర్‌కు ప్రతిపాదన
- ఈ ప్రకటన తర్వాత భారీగా పెరిగిన ట్విట్టర్ షేర్
టెస్లా అధినేత ఎలన్ మస్క్ మనసు మార్చుకున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ను కొనుగోలు చేయడానికి మళ్లీ రెడీ అయ్యారు. న్యాయ వివాదాన్ని కొనసాగించకుండా.. ఈ డీల్‌ను ఎలాగైనా పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ ఏప్రిల్‌లో ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్ డాలర్లకు (రూ.3.50 లక్షల కోట్లు) ట్విట్టర్‌ను వంద శాతం కొనుగోలు చేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. కానీ, తర్వాత ఈ డీల్ ను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపి అందరికీ షాకిచ్చారు.
దీనివల్ల తమ కంపెనీ షేర్లు నష్టపోయాయని మస్క్ పై ట్విట్టర్ న్యాయ పోరాటం చేస్తోంది. కొన్ని నెలల ప్రతిష్ఠంభన తర్వాత ఇరు పార్టీల మధ్య రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో చెప్పినట్లే ట్విట్టర్ లో ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేస్తానని మస్క్ ప్రతిపాదన చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ కూడా నిర్థారించింది. వీలైనంత త్వరగా డీల్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. మస్క్ ప్రతిపాదన తర్వాత ట్విట్టర్ షేరు భారీగా పెరిగింది. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 22 శాతం మేర పెరిగి 52 డాలర్ల వద్ద స్థిరపడింది.