కోస్తాంధ్రలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
- కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- ఉపరితల ఆవర్తనానికి తోడు ద్రోణి విస్తరణ
- నిన్న కూడా పలు జిల్లాల్లో వర్షం
కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయని, వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
అలాగే, చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వివరించింది. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నిన్న కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.