రూసో మెరుపు సెంచరీ... టీమిండియా టార్గెట్ 228 రన్స్
- ఇండోర్ లో మ్యాచ్
- టాస్ గెలిచిన టీమిండియా
- దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్
- టీమిండియా బౌలర్లపై విరుచుకుపడిన రూసో
ఇప్పటికే సిరీస్ కోల్పోయిన సఫారీలు చివరి టీ20లో గెలిచి పరువు నిలుపుకునేందుకు పట్టుదలతో ఉన్నారు. ఇండోర్ మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటింగ్ తీరే అందుకు నిదర్శనం.
రిలే రూసో మెరుపు సెంచరీ సాయంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగులు చేసింది. రూసో కేవలం 48 బంతుల్లోనే 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 7 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. మైదానం చిన్నది కావడంతో పరుగులు వెల్లువెత్తాయి.
ఓపెనర్ క్వింటన్ డికాక్ 43 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 68 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బవుమా (3) ఆరంభంలోనే వెనుదిరిగినా, రూసో, డికాక్ జోడీ భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ట్రిస్టాన్ స్టబ్స్ 23, డేవిడ్ మిల్లర్ 5 బంతుల్లో 19 (నాటౌట్) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో చహర్ 1, ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ తీశారు.