రాంలీలా మైదానంలో రావణ దహనానికి హాజరు కానున్న ప్రభాస్
- కరోనా కారణంగా రెండేళ్లుగా రాంలీలా మైదానంలో జరగని రావణ దహనం
- ఈ ఏడాది అట్టహాసంగా కార్యక్రమం నిర్వహణకు రాంలీలా కమిటీ తీర్మానం
- ఆదిపురుష్‌లో రాముడిగా నటిస్తున్న ప్రభాస్‌కు ఆహ్వానం
- రాష్ట్రపతి, ఢిల్లీ సీఎంలతో కలిసి వేడుకలకు హాజరుకానున్న ప్రభాస్
టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో వేడుకగా జరిగే రావణ దహనానికి హాజరు కావాలంటూ ఆయనకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రభాస్‌కు రాంలీలా కమిటీ నుంచి ఆహ్వానం అందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లతో కలిసి ప్రభాస్ ఈ వేడుకకు హాజరు కానున్నారు.
కరోనా కారణంగా రెండేళ్లుగా రాంలీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం జరగలేదు. కరోనా విస్తృతి భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో ఈ ఏడాది రావణ దహన వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు రాంలీలా కమిటీ తీర్మానించింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాంలీలా మైదానంలో రావణ దహనానికి హాజరు కావాలంటూ ఆయనకు రాంలీలా కమిటీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. ఈ ఆహ్వానం మేరకు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న ప్రభాస్ మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరారు.