సినిమాల పట్ల ఇష్టంతో నేను ఎంత రిస్క్ చేశానంటే: ప్రవీణ్ సత్తారు
- రేపు రిలీజ్ అవుతున్న 'ది ఘోస్ట్'
- ప్రమోషన్స్ లో బిజీగా ప్రవీణ్ సత్తారు
- సినిమాల కోసం జాబ్ వదిలేశానన్న డైరెక్టర్
- నీళ్లలోకి దూకేసిన తరువాత ఈత నేర్చుకున్నానని వెల్లడి
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. రేపు ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించాడు. "నేనూ ఇండస్ట్రీకి రావడానికి ముందు యూఎస్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసేవాడిని. సినిమాల పట్ల ఇష్టంతో ఇటువైపు వచ్చాను. ఇక్కడ వాటర్లో మొసళ్లు ఉంటాయని తెలియక దిగిపోయాను .. దిగిన తరువాత తప్పదు గనుక ఈత నేర్చుకున్నాను" అన్నాడు.
"జాబ్ చేయడం వలన నా లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోయేది. కానీ నాకు బోర్ కొట్టేసింది. అన్నీ అందుబాటులో ఉంటే అలాగే ఉంటుందేమో మరి. అదే జాబ్ చేస్తూ వెళితే పదేళ్ల తరువాత ఏ స్థాయిలో ఉంటానో తెలుసు. ఎలాంటి ఇంట్లో ఉంటానో .. ఎలాంటి కారు కొంటానో తెలుసు. రేపు నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియకూడదు .. ఎలా ఉంటానో తెలియకూడదు. లైఫ్ అనేది స్క్రిప్ట్ రాసుకున్నట్టుగా ఉండకూడదనేది నా ఫీలింగ్.
మొదటి నుంచి కూడా క్రియేటివ్ సైడ్ ఆసక్తి ఉండేది. ఖాళీ సమయంలో స్క్రిప్ట్ రాసుకుంటూ ఉండేవాడిని. అలా నెమ్మదిగా సినిమాల వైపు వచ్చాను. 'ది ఘోస్ట్' సినిమా మొత్తం రెడీ అయ్యేంతవరకూ నాగార్జునగారు చూడలేదు. అందుకు కారణం నా పట్ల ఆయనకి గల నమ్మకమే. సినిమా చూసిన తరువాత నాగార్జున గారు నన్ను అభినందించినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది" అంటూ చెప్పుకొచ్చాడు.