ఆ రోజున వర్షంలో తడుస్తూ మాట్లాడటానికి కారణం అదే: 'గాడ్ ఫాదర్' ప్రెస్ మీట్ లో చిరంజీవి
- రేపు విడుదలవుతున్న 'గాడ్ ఫాదర్'
- కొంత సేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్
- ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్రస్తావించిన చిరూ
- తన సింప్లిసిటీకి అదే కారణమంటూ వెల్లడి
చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన 'గాడ్ ఫాదర్' రేపు భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ .. "ఈ రోజున ప్రెస్ మీట్ ను పెట్టాలని కోరుకున్నవారిలో నేను ఒకడిని. ఈ సినిమా కోసం కష్టపడిన వాళ్లందరికీ ఆ రోజున ప్రీ రిలీజ్ ఈవెంటులో కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది.
వర్షం కారణంగా ఆ రోజున అంతా కూడా రసాభాస అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ సందర్భాన్ని మొత్తం నా చేతుల్లోకి తీసుకుని, నా ప్రేమాభిమానాలను వ్యక్తం చేయడానికి కారకులు మీడియా మిత్రులే. ఫంక్షన్ మొత్తం గందరగోళమై పోయింది .. ఏమీ జరగలేదంటూ నెగెటివ్ గా రాస్తారేమో .. వాళ్లకి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో, మైక్ తీసుకుని మరో రకంగా ఆ సందర్భాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాను.
ఆ ఫంక్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరిలో సంతోషాన్ని చూడగలిగాను .. సంతృప్తిని నింపగలిగాను. అందుకోసమే ఆ రోజున నేను వర్షంలో తడుస్తూ మాట్లాడాను. నేను చాలా సింపుల్ గా ఉంటానని అందరూ అంటూ ఉంటారు. అలా ఉండటానికి కారణం నన్ను అలా మలచినవారే. ఇదంతా నా గొప్పతనమేనని అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదు" అంటూ చెప్పుకొచ్చారు.