'ఘోస్ట్' నేపథ్యం ఏమిటనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది: నాగార్జున
- 'ది ఘోస్ట్' ప్రమోషన్స్ లో బిజీగా నాగ్
- డిఫరెంట్ జోనర్స్ పట్ల ఆసక్తి ఉందంటూ వెల్లడి
- జనానికి కావాల్సింది కంటెంట్ అంటూ వ్యాఖ్య
- రేపు రిలీజ్ అవుతున్న సినిమా
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన 'ది ఘోస్ట్' రేపు థియేటర్లకు రానుంది. యాక్షన్ - ఎమోషన్ తో కలిసి నడిచే కథ ఇది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జునను అడివి శేష్ తో ఇంటర్వ్యూ చేయించారు. "కష్టపడి నేను ఈ జోనర్ ను సెట్ చేసుకుంటే, మీరు దీంట్లోకి కూడా వచ్చారేంటి సార్' అంటూ అడివి శేష్ ఇంటర్వ్యూను మొదలుపెట్టాడు.
నాగార్జున మాట్లాడుతూ .. " కొత్తదనం కోసం నేను డిఫరెంట్ జోనర్లు ట్రై చేస్తూ వస్తున్నాను. అలా చేసిందే ఈ సినిమా. పండగకి పెద్ద సినిమాల మధ్య పోటీ ఉంటుందని అంటున్నారు. 30 ఏళ్ల నుంచి చూస్తున్నాను .. గతంలో 'సంక్రాంతి' .. 'దసరా' వంటి పండుగలకి ఇంతకంటే ఎక్కువ సినిమాలు వచ్చేవి. అయినా అవన్నీ కూడా బాగానే ఆడటం జరిగింది.
పండుగ రోజున సరదాలు .. సందళ్లు తరువాత, అందరూ సినిమాలను గురించే ఆలోచిస్తారు. అందువలన పండుగ రోజుల్లో అన్ని సినిమాలు బాగానే ఆడుతూ ఉంటాయి. 'విక్రమ్' .. 'మేజర్' సినిమాలు ఒకే రోజున వచ్చినప్పటికీ బాగా ఆడాయి. కంటెంట్ ఉంటే
థియేటర్స్ కి రావడానికి జనాలు పెద్దగా ఆలోచన చేయరు. ఇక పండుగ రోజున సెలవు కలిసొస్తే ప్రత్యేకించి చెప్పనవసరమే లేదు" అంటూ చెప్పుకొచ్చారు.