8 నెలల చిన్నారి సహా అమెరికాలో నలుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం
- కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో ఘటన
- కిడ్నాప్ చేసిన దుండగుడి వద్ద ఆయుధాలు ఉన్నాయన్న పోలీసులు
- ఎందుకు కిడ్నాప్ చేశాడో వివరాలు తెలియలేదని వెల్లడి
అమెరికాలో ఎనిమిది నెలల చిన్నారి సహా నలుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం సృష్టించింది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీ నుంచి వీరిని కిడ్నాప్ చేశారు. జస్దీప్ సింగ్ (36), జస్లీన్ కౌర్ (26) దంపతులు, వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరితో పాటు అమన్‌దీప్ సింగ్ (39) కూడా అపహరణకు గురి అయినట్టు మెర్సిడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. వీళ్లను కిడ్నాప్ చేసిన నిందితుడి దగ్గర ఆయుధాలు ఉన్నాయని, అతను ప్రమాదకరమైనవాడని పోలీసులు వివరించారు. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున ఈ సంఘటన గురించి చాలా వివరాలు విడుదల కాలేదు.
వీళ్లను అపహరించిన అపహరణ స్థలం చిన్న వ్యాపారులు, రెస్టారెంట్లతో కూడిన రహదారితో కూడినదని చెప్పారు. అనుమానితుడితో పాటు ఈ నలుగురిని కిడ్నాప్ చేయడానికి గల కారణం ఏమిటో పోలీసులు ఇంకా గుర్తించలేదు. అనుమానితుడు లేదా బాధితులు కనిపిస్తే నేరుగా వారి వద్దకు వెళ్లకుండా అత్యవసర నంబర్ 911కి ఫోన్ చేయాలని అధికారులు ప్రజలను కోరారు. కాగా, 2019లో తుషార్ అత్రే అనే భారత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాలిఫోర్నియా ఇంటి నుంచి కిడ్నాప్ అయినట్టు వార్తలు వచ్చిన కొన్ని గంటల తర్వాత తన స్నేహితురాలు కారులో విగతజీవిగా కనిపించాడు.