'గాడ్ ఫాదర్' .. నాలుగు దశాబ్దాల మెగా చరిత్రకి శీర్షిక: అనంత శ్రీరామ్
- 'గాడ్ ఫాదర్' ప్రెస్ మీట్ లో అనంత శ్రీరామ్
- ఎంతోమందికి మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' అంటూ వ్యాఖ్య
- తనకి ఛాన్స్ ఇచ్చింది కూడా ఆయనేనంటూ వెల్లడి
- నవయువకులకు ఆయన స్ఫూర్తి అంటూ హర్షం
చిరంజీవి - మోహన్ రాజా కాంబినేషన్లో రూపొందిన 'గాడ్ ఫాదర్' సినిమా రేపు థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో పాటల రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ .. 'గాడ్ ఫాదర్' నా దృష్టిలో ఇది కేవలం మూడు గంటల నిడివి కలిగిన సినిమాకి పెట్టిన పేరు కాదు. నాలుగు దశాబ్దాల మెగా చరిత్రకు శీర్షిక అని నా అభిప్రాయం.
ప్రభుదేవా .. లారెన్స్ .. రాజ్ - కోటి .. మణిశర్మ ఇలా ఎంతోమంది వెనక కనిపించే ఒకే ఒక్క గాడ్ ఫాదర్ చిరంజీవి గారు. నేను పాటలు రాయగలను అన్ని నమ్మి .. 'అందరివాడు' సినిమాతో నాకు అవకాశం ఇచ్చింది, 17 ఏళ్లుగా ఈ ప్రస్థానం ఇలా కొనసాగ డానికి కారకులు కూడా చిరంజీవిగారే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆయన నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు .. ముందుకు నడిపిస్తూనే ఉన్నారు.
మనం చేసిన పనిని మనకే కొత్తగా పరిచయం చేయగలిగిన అవిశ్రాంత శ్రామికుడు చిరంజీవిగారు. చిరంజీవిగారిని కలిసిన ప్రతి ఒక్కరికీ కూడా, అదృష్టాన్ని కాదు ... కష్టాన్ని నమ్ముకుంటేనే ఎదుగుతామనే విషయం మొదటి రోజునే తెలిసిపోతుంది. ఈ వయసులో కూడా మండుటెండలో పనిచేయడం .. నిండువానలో ప్రసంగించడమనేది నవయువకులకు స్ఫూర్తిని కలిగిస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు.