'లూసిఫర్'లో లేనిది 'గాడ్ ఫాదర్'లో థ్రిల్ చేస్తుంది: డైరెక్టర్ మోహన్ రాజా
- 'గాడ్ ఫాదర్' ప్రమోషన్స్ లో మోహన్ రాజా
- చిరూ స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటూ వ్యాఖ్య
- తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అవుతుందంటూ కితాబు
- ఈ నెల 5వ తేదీన విడుదలవుతున్న సినిమా
మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' అక్కడ జయకేతనాన్ని ఎగరేసింది. మోహన్ లాల్ కెరియర్ లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. అలాంటి ఆ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్ రాజా రూపొందించాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 5వ తేదీన 'దసరా' కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి మోహన్ రాజా మాట్లాడాడు.
'లూసిఫర్' సినిమా ఆల్రెడీ హిట్ .. తెలుగులో కొత్తగా ఏవుంటుంది? అనే చాలా మంది అనుకుంటారు. కానీ 'లూసిఫర్' లో లేని ఒక కొత్త అంశాన్ని తెలుగులో టచ్ చేశాము. ఆ కొత్త అంశం ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తుంది .. ఒక కొత్త కథను చూసినట్టుగానే అనిపిస్తుంది. ఎక్కడా కూడా మరోసారి 'లూసిఫర్'ను చూస్తున్నట్టుగా అనిపించదు. అంతగా కసరత్తు చేయడం జరిగింది" అని అన్నాడు.
"ఈ సినిమాలో చిరూ లుక్ దగ్గర నుంచి కొత్తదనానికి ప్రయత్నిస్తూ వెళ్లాము. మెగాస్టార్ స్టైల్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అనే మాటను మీరే ఒప్పుకుంటారు. ఇక నయనతార తప్ప ఆ పాత్రకి వేరెవరూ సెట్ కారని కూడా మీరే అంటారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ప్రధానమైన బలంగా చేసుకుని, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాము" అంటూ చెప్పుకొచ్చాడు.