కాంతులీనే చర్మం కోసం విటమిన్ సి తప్పనిసరి అంటున్న నిపుణులు
- ఇమ్యూనిటీ పెంచే విటమిన్ సి
- శరీర పనితీరును క్రమబద్ధం చేసే విటమిన్
- ఇందులో యాంటీ ఆక్సిడాంట్లు పుష్కలం
- ముడతల్లేని చర్మాన్ని అందించే విటమిన్ సి
వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలలో విటమిన్ సి ఎంతో ముఖ్య పాత్ర పోషించడం తెలిసిందే. విటమిన్ సి లేక ఆస్కార్బిక్ యాసిడ్ ఇమ్యూనిటీ పెంచడమే కాదు, శరీరంలోని వివిధ వ్యవస్థల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాదు, కాంతులీనే ఆరోగ్యకరమైన చర్మం కోసం విటమిన్ సి తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.
చర్మ సంరక్షణకు అవసరమైన యాంటీఆక్సిడాంట్లను విటమిన్ సి అందిస్తుంది. దెబ్బతిన్న చర్మ కణాల మరమ్మతులు, చెడు పదార్థాల తొలగింపును సులభతరం చేస్తుంది. తద్వారా ముడతలు లేని చర్మం సొంతమవుతుంది. కొలాజెన్ పదార్థం ఉత్పత్తిని పెంచడం ద్వారా గాయాలు త్వరగా మానిపోయేలా చేస్తుంది. అందుకే డాక్టర్లు విటమిన్ సి సప్లిమెంట్లను ప్రత్యేకంగా సూచిస్తుంటారు.
విటమిన్ సిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. ఇవి దద్దుర్లు, చర్మం ఎర్రబారడం, చికాకు వంటి సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాదు, మొటిమలు, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ రుగ్మతలకు విటమిన్ సితో చెక్ పెట్టొచ్చట. విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా చర్మంపై మచ్చలు, కళ్ల కింద వలయాలు తొలగిపోతాయని పోషకాహార నిపుణులు వెల్లడించారు.
విటమిన్ సి నిమ్మ, నారింజ జాతి పండ్లలోనూ, ఉసిరికాయల్లోనూ, జామ పండ్లలోనూ, టమాటాలు, బంగాళాదుంపలు, పైనాపిల్, స్ట్రాబెర్రీలు, బొప్పాయి, ఆకుకూరల్లో అధికంగా లభ్యమవుతుంది.