పూరిని తిట్టే హక్కు నాకు ఉంది .. నన్ను కొట్టే హక్కు ఆయనకి ఉంది: బండ్ల గణేశ్ 

  • తాజా ఇంటర్వ్యూలో బండ్ల గణేశ్ 
  • ఎన్టీఆర్ కోసం ప్రాణం ఇస్తానంటూ వ్యాఖ్య 
  • పూరితో 30  ఏళ్ల అనుబంధం ఉందని వెల్లడి 
  • ఆయనకి మంచి - చెడు చెప్పే రైట్ తనకి ఉందంటూ వివరణ  

కొంత కాలంగా నిర్మాతగా బండ్ల గణేశ్ సినిమాలకి దూరంగా ఉంటున్నాడు. అడపా దడపా ఆర్టిస్టుగా తెరపై కనిపిస్తున్నాడు. కొన్ని స్టేజ్ లపై బండ్ల గణేశ్ మాట్లాడిన మాటలు .. ఆయన చేస్తున్న ట్వీట్లు గురించిన ప్రస్తావన తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చింది. అందుకు ఆయన స్పందిస్తూ ... " కేసీఆర్ గారు వ్యవసాయం విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ గురించి నేను ప్రత్యక్షంగా చూశాను గనుక ఆయనను అభినందిస్తూ ట్వీట్ చేశాను. మంచిపని చేస్తున్నప్పుడు ఒప్పుకోవడానికి .. మెచ్చుకోవడానికి అదే పార్టీకి చెందినవారే ఉండవలసిన అవసరం లేదు. అలాంటి ఉద్దేశంతో నేను ఆ ట్వీట్ చేయలేదు" అన్నాడు. 

ఇక ఎన్టీఆర్ ను నేను అభినందించడం తప్పు ఎలా అవుతుంది? ఆయన అభిమానులు ఫీలవుతున్నారని ఆ ట్వీట్ పెట్టాను. ఎన్టీఆర్ నా హీరో .. ఆయన పట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. నా ప్రాణం పోయినా ఎన్టీఆర్ ను నేను కామెంట్ చేయను. ఆయనతో రెండు సినిమాలు చేశాను. ఒకటి సూపర్ హిట్ అయితే ... మరొకటి బ్లాక్ బస్టర్. నేను మెగా ఫ్యామిలీకి దగ్గర .. ఎన్టీఆర్ కి దూరం అనేది పుకారు మాత్రమే. నేను పూరి విషయంలో జోక్యం చేసుకుంటే ఆయన 'నాలుక జాగ్రత్తగా పెట్టుకో' అంటూ వార్నింగ్ ఇచ్చారనేది అబద్ధమని అన్నాడు. 

పూరి నాకు వార్నింగ్ ఇచ్చిన ఆధారం చూపించండి. ఆయినా పూరి గురించి నేనేమీ తప్పుగా మాట్లాడలేదే. భార్యా పిల్లలను ప్రేమించలేనివాడు మనిషేనా? పూరి అనేవాడికి మంచి - చెడు చెప్పే రైట్ నాకు ఉంది .. నా ఫ్రెండ్. మా ఇద్దరి మధ్య 30 ఏళ్ల బంధం ఉంది. ఆయనను తిట్టేహక్కు నాకు ఉంది .. నన్ను కొట్టేహక్కు ఆయనకి ఉంది" అంటూ చెప్పు కొచ్చాడు.  



More Telugu News