భారత వాయుసేన చేతికి 'ప్రచండ్' హెలికాప్టర్లు
- దేశీయంగా తయారైన పోరాట హెలికాప్టర్లు
- అభివృద్ధి చేసిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
- 'ప్రచండ్' గా నామకరణం
- హెలికాప్టర్లను వాయుసేనలో చేర్చిన రాజ్ నాథ్ సింగ్
దేశీయంగా తయారైన తేలికపాటి పోరాట హెలికాప్టర్ 'ప్రచండ్' భారత్ రక్షణ రంగ సత్తాను మరింత ఇనుమడింపజేయనుంది. తాజాగా తొలి విడత 'ప్రచండ్' హెలికాప్టర్లను నేడు భారత వాయుసేనకు అప్పగించారు. 'ప్రచండ్' హెలికాప్టర్ క్షిపణులను, ఇతర ఆయుధాలను ప్రయోగించగలదు.
ఈ ఆధునిక తరం హెలికాప్టర్లను భారత వాయుసేనలో చేర్చే కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి హాజరయ్యారు. రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, రక్షణ రంగ ఉత్పాదకతలో భారత్ సామర్థ్యాలను ప్రతిబింబించే దిశగా ఇది చారిత్రాత్మక సందర్భం అని అభివర్ణించారు.
ప్రభుత్వ రంగ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిడెట్ (హెచ్ఏఎల్) ఈ లైట్ కంబాట్ హెలికాప్టర్ (ఎల్సీహెచ్)ను అభివృద్ధి చేసింది. ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో పోరాటానికి అనువుగా వీటిని తీర్చిదిద్దారు. ఈ హెలికాప్టర్ కు 'ప్రచండ్' అని నామకరణం చేశారు.
దీని బరువు 5.8 టన్నులు. దీంట్లో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఇప్పటికే ఇది అనేక పరీక్షలు పూర్తిచేసుకుంది. శత్రువుపై దాడి చేయడమే కాదు, ప్రమాదం ఎదురైనప్పుడు విచిత్రమైన విన్యాసాలు చేసి తప్పించుకోగలదు.