వాట్సాప్ లో ఈ ప్రత్యేక సేవలు ఉన్నాయని మీకు తెలుసా?

  • చాట్ బాట్ సాయంతో వివిధ సేవలు
  • జియోమార్ట్ పై ఆర్డర్ చేయవచ్చు
  • రైలు ప్రయాణంలో ఆహారం తెప్పించుకోవచ్చు
  • ఊబర్ క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు
వాట్సాప్ ఇతరులతో సంబంధాలకే కాదు, కొన్ని రకాల సేవలకూ వేదికగా ఉపయోగపడుతుందనే విషయం చాలా కొద్ది మందికే తెలుసు. వాట్సాప్ పై చాట్ బాట్స్ చాలానే ఉన్నాయి. అందులో ఎక్కువ మందికి ఉపయోగపడే వాటిని పరిశీలించినట్టయితే..

జియోమార్ట్ చాట్ బాట్
వాట్సాప్ నుంచే జియోమార్ట్ వేదికపై ఉండే వాటిని ఆర్డర్ చేయవచ్చు. ఇందుకోసం 7977079770 నంబర్ ను వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్ లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ నంబర్ కు Hi అని టైప్ చేయాలి. అప్పుడు జియోమార్ట్ కేటలాగ్ వస్తుంది. కావాల్సిన ఐటమ్స్ ను కార్ట్ కు యాడ్ చేసుకుని, డెలివరీ అడ్రస్ టైప్ చేసి దాన్ని సెండ్ చేయాలి. డెలివరీ సమయంలో పేమెంట్ చేసే ఆప్షన్ ఎంచుకోవచ్చు. లేదంటే బిల్లు మొత్తాన్ని అక్కడే వాట్సాప్ పే ద్వారా చెల్లించొచ్చు.

రైలు దగ్గరకే ఫుడ్ డెలివరీ
రైలులో ప్రయాణిస్తూ మంచి ఆహారం కోరుకునే వారి కోసం జూప్ చాట్ బాట్ ఉంది. ఐఆర్ సీటీసీ సహకారంతో నడిచే ఈ సేవను ఉపయోగించుకుని ప్రయాణికులు తమకు కావాల్సిన ఆహార పదార్థాలను తామున్న సీటు దగ్గరకే తెప్పించుకోవచ్చు. 7042062070 ఈ నంబర్ ను సేవ్ చేసుకోవాలి. పీఎన్ఆర్ నంబర్, సీటు నంబర్, రెస్టారెంట్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఈ నంబర్ ను సంప్రదించడం ద్వారా రెస్టారెంట్ల సమాచారం లభిస్తుంది. తదుపరి వచ్చే స్టేషన్లు, ఆయా స్టేషన్లలో అందుబాటులోని రెస్టారెంట్ల వివరాలు ఉంటాయి. కోరుకున్న స్టేషన్ రాగానే, సదరు రెస్టారెంట్ నుంచి ఆహారం ప్రయాణికులకు డెలివరీ అవుతుంది. 

క్యాబ్ బుకింగ్
ఊబర్ క్యాబ్ బుక్ చేసుకోవాలంటే ఊబర్ యాప్ ఉండాలనేమీ లేదు. 7292000002 ఈ నంబర్ ను సేవ్ చేసుకుని క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా Hi అని టైప్ చేయాలి. ఆ తర్వాత ఊబర్ ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వాలి. పికప్, డెలివరీ లొకేషన్ వివరాలు ఇచ్చిన తర్వాత క్యాబ్ బుక్ అవుతుంది. ఎంత చార్జీ, డ్రైవర్ వివరాలు అక్కడే లభిస్తాయి. 

ఫ్లయిట్ల సమాచారం
వాట్సాప్ నుంచే ఇండిగో (7428081281), ఎయిర్ ఇండియా (9154195505) చాట్ బాట్స్ సాయంతో ఫ్లయిట్ల సమాచారం, స్టేటస్, వెబ్ చెక్ ఇన్, టికెట్ బుకింగ్ సేవలను పొందొచ్చు.


More Telugu News