భార్య సరుకులు తెమ్మంటే వెళ్లి.. కోటిన్నర లాటరీ కొట్టుకొచ్చాడు!
- ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వస్తూ సరుకులు తెమ్మన్న భార్య
- సామగ్రి కోసం సూపర్ మార్కెట్ వద్ద ఆగిన భర్త
- అక్కడే ఉన్న ఓ లాటరీ స్టోర్ లో టికెట్ కొన్న వైనం
- మరునాడు చెక్ చేసుకుంటే లాటరీ తగిలినట్టు గుర్తింపు
ఇల్లాలు చెప్పినట్టు వింటే ఇల్లు స్వర్గమవుతుందని ఇటీవలికాలంలో బాగా తిరుగుతున్న సామెత. ఎవరు మొదలుపెట్టారోగానీ.. ఇలా విన్నందుకు ఓ వ్యక్తికి మాత్రం అదృష్టం వచ్చి అతుక్కుంది. ఆఫీసు నుంచి ఇంటికి వస్తుండగా సూపర్ మార్కెట్ కు వెళ్లి సామగ్రి తెమ్మని భార్య చెబితే.. ఆ వ్యక్తి ఏకంగా కోటిన్నర లాటరీ కొట్టుకొచ్చాడు.
సరదాగా చూద్దామని వెళ్లి..
ఆయన పేరు ప్రెస్టన్ మాకి. వయసు 46 ఏళ్లు. అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం మార్క్వెట్ట్ ప్రాంతంలో నివాసం ఉంటాడు. ఇటీవల మామూలుగానే పొద్దున్నే ఆఫీసుకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తుండగా సూపర్ మార్కెట్ కు వెళ్లి సరుకులు తెమ్మని భార్య మెస్సేజ్ పెట్టింది. అది చూసుకున్న ప్రెస్టన్.. ఆఫీసు నుంచి వస్తూ వస్తూ మేయిజర్ గ్రోసరీ స్టోర్ వద్ద ఆగాడు. సరుకులు తీసుకుంటూ ఉండగా.. ఆ స్టోర్ లో ఓ పక్కన ఉన్న లాటరీ టికెట్ల సెంటర్ పై దృష్టి పడింది.
మామూలుగా అయితే ఆయనకు లాటరీ టికెట్లు కొనే అలవాటు పెద్దగా లేదు. కానీ అప్పుడు ఎందుకో తీసుకుందామని అనిపించింది. వెంటనే వెళ్లి మిషిగన్ స్టేట్ లాటరీకి చెందిన ‘ఫ్యాంటసీ 5’ లాటరీ టికెట్ ను కొనుగోలు చేశాడు. సామగ్రి తీసుకుని ఇంటికి వచ్చేశాడు.
కిచెన్ లో పనిచేస్తుండగా గుర్తొచ్చి..
మరుసటిరోజు కిచెన్ లో ఏదో పని చేస్తుండగా ప్రెస్టన్ కు లాటరీ టికెట్ గురించి గుర్తుకొచ్చింది. దానితో ఫోన్ తీసుకుని లాటరీకి చెందిన మొబైల్ యాప్ ఓపెన్ చేసి టికెట్ నంబర్ ను స్కాన్ చేశాడు. తనకు బహుమతి వచ్చిందని గుర్తించి ఆశ్చర్యపోయాడు. ఆ లాటరీ టికెట్ కు 1,90,736 డాలర్లు (మన కరెన్సీలో సుమారు 1.5 కోట్ల రూపాయలు బహుమతి వచ్చింది. మొదట దాన్ని తాను నమ్మలేదని, మళ్లీ మళ్లీ చెక్ చేసుకుని ఆశ్చర్యపోయానని ప్రెస్టన్ చెబుతున్నాడు.

- తన భార్య చెప్పడంతో సూపర్ మార్కెట్ కు వెళ్లడం వల్లే తమకు అదృష్టం కలిసి వచ్చిందని అంటున్నాడు. తన భార్య చెప్పకపోయి ఉన్నా, తాను ఆ పనిచేయకపోయి ఉన్నా లాటరీ తగిలేది కాదని పేర్కొంటున్నాడు.
- తాను గెలుచుకున్న డబ్బుల్లో కొంత మొత్తాన్ని కుటుంబ సభ్యులకు ఇస్తానని.. మిగతా మొత్తాన్ని భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేస్తానని అంటున్నాడు.
- ఈ లాటరీ విషయాన్ని వార్తల్లో తెలుసుకున్న నెటిజన్లు.. ‘‘అదృష్టం ఎటువైపు నుంచి కలిసి వస్తుందో చెప్పలేం.. వచ్చిందంటే అలా మీద పడిపోతుంది’’ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.