ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

  • కొనసాగుతున్న దసరా శరన్నవరాత్రులు
  • నేడు మూలా నక్షత్రం
  • అమ్మవారి సన్నిధికి వచ్చిన సీఎం జగన్
  • పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ మూలా నక్షత్రం రోజున ఏపీ సీఎం జగన్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. 

అంతకుముందు, దుర్గగుడిలో సీఎం జగన్ కు వేదపండితులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎంకు మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని తదితరులు కూడా స్వాగతం పలికారు. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీ భద్రత ఏర్పాటు చేశారు.


More Telugu News