విజయ్ తప్పు చేయకపోతే ఎందుకు గోడ దూకి పారిపోయాడు?: మంత్రి జోగి రమేష్

  • చింతకాయల విజయ్ ఇంట్లో నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు
  • టీడీపీ నేతల ఆగ్రహావేశాలు
  • ఘాటుగా స్పందించిన మంత్రి జోగి రమేష్
  • స్త్రీల గురించి దారుణ పోస్టులు పెట్టాడని ఆరోపణ
  • ఎల్లో మీడియా సపోర్ట్ చేస్తోందంటూ ఆగ్రహం
చింతకాయల విజయ్ కి ఏపీ సీఐడీ నోటీసుల అంశంపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. చింతకాయల విజయ్ స్త్రీల మాన ప్రాణాల గురించి దారుణమైన రీతిలో వెబ్ సైట్లో పోస్టులు పెట్టాడని ఆరోపించారు. విజయ్ తప్పు చేయకపోతే ఎందుకు గోడ దూకి పారిపోయాడని ప్రశ్నించారు. అతడేమీ తప్పు చేయకపోతే సీఐడీ పోలీసులకు ధైర్యంగా సమాధానం చెప్పాలి అని అన్నారు. 

నాడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న తండ్రి (అయ్యన్నపాత్రుడు) పొక్లెయిన్ తీసుకెళితే పారిపోయాడని, నేడు తప్పుడు పని చేసి కొడుకు (విజయ్) పారిపోయాడని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఐటీడీపీని పర్యవేక్షిస్తోంది చింతకాయల విజయ్ అని వెల్లడించారు. రాజ్యాంగం టీడీపీ వాళ్లకు వర్తించదనుకుంటున్నారా? అందుకే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

చింతకాయల విజయ్ నివాసానికి సీఐడీ పోలీసులు వెళితే దాడి చేసినట్టు అసత్య కథనాలు రాశారని మండిపడ్డారు. ఒక దొంగకు ఎల్లో మీడియా మద్దతుగా నిలుస్తోందని విమర్శించారు. అలాంటి వాళ్లను సమర్థిస్తే రేపు మీ కుటుంబ సభ్యులపైనా పోస్టులు పెడతారు... రామోజీరావు, రాధాకృష్ణలకు కూడా కుటుంబాలు ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. 




More Telugu News