రేపు బెజవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

  • ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
  • రేపు మూలా నక్షత్రం
  • మధ్యాహ్నం 3 గంటలకు ఆలయం వద్దకు సీఎం జగన్
  • భారీగా భద్రతా ఏర్పాట్లు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. కాగా, రేపు (అక్టోబరు 2) ఏపీ సీఎం జగన్ బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రి వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు సెక్యూరిటీ ట్రయల్ రన్ చేపట్టారు. మూలానక్షత్రం నేపథ్యంలో సీఎం జగన్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకోనున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేయనున్నారు. 

కాగా, మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని దేవస్థానం వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ అర్ధరాత్రి నుంచే క్యూలైన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కొండపైకి వాహనాలు అనుమతించబోమని, రేపు అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనాలేనని అధికారులు వెల్లడించారు.


More Telugu News