బట్టర్ చికెన్ ఐస్ క్రీమ్.. దానిపై గ్రీన్ చట్నీ.. వైరల్ గా మారిన సరికొత్త ప్రయోగం!
- ఇన్ స్టాగ్రామ్ లో బట్టర్ చికెన్ ఐస్ క్రీమ్ వీడియోను పెట్టిన ఫుడ్ వుడ్ ఇండియా నిర్వాహకులు
- వామ్మో ఇదేం ఐస్ క్రీమ్ అని కొందరు అంటుంటే.. టేస్ట్ ఎలా ఉందంటూ అడుగుతున్న మరికొందరు
- స్పైసీగా ఉంటే బాగుంటుందని కొందరు, బట్టర్ చికెన్ తియ్యగా ఉంటే ఎలా ఉంటుందోనన్న ఆశ్చర్యంతో ఇంకొందరి కామెంట్లు
వెనీలా, బట్టర్ స్కాచ్, స్ట్రాబెర్రీ.. ఇలా ఎన్నో వెరైటీల ఐస్ క్రీమ్ లు. తర్వాతి కాలంలో బాదాం, పిస్తా, ఇతర డ్రైఫ్రూట్స్ వేసిన ఐస్ క్రీమ్ లూ వచ్చాయి. ఆ తర్వాత ఐస్ క్రీమ్ కేక్ లూ ప్రాచుర్యం పొందాయి. అక్కడక్కడా నోరు తిరగని పేర్లతోనూ భిన్నమైన ఫ్లేవర్లను కలిపిన ఐస్ క్రీమ్ లు లభిస్తుంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. అప్పుడప్పుడూ, అక్కడక్కడా కొన్ని రకాల ఐస్ క్రీమ్ ల గురించి వింటుంటే, చూస్తుంటే అదో రకమైన అనుభూతి కలుగుతుంది. అలాంటి ఓ ఐస్ క్రీమ్ గురించే ఈ చర్చ అంతా.
బట్టర్ చికెన్ తో..
బట్టర్ చికెన్ ను గ్రైండ్ చేసి రూపొందించిన ఐస్ క్రీమ్ ను ఓ మట్టి పాత్రలో వేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ముదురు పసుపు రంగులో ఉన్న ఐస్ క్రీమ్ పైన గ్రీన్ చట్నీని కూడా వేసి అందించారు. పొగలు కక్కుతూ ఉన్న ఐస్ క్రీమ్ ను వీడియోలో చూపించారు. ఫుడ్ వుడ్ ఇండియా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఈ వీడియోకు లక్షకుపైగా వ్యూస్, పెద్ద సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి.

- ‘‘వామ్మో ఇదేం ఐస్ క్రీమ్. ఎవరైనా ఇలాంటివి తింటారా?” అని కొందరు కామెంట్ చేస్తే.. ‘‘ఏదైనా ప్రయోగాలు చేస్తుంటే భలేగా ఉంటుంది. ఐస్ క్రీమ్ టేస్ట్ ఎలా ఉందో చెప్తారా?” అని మరికొందరు సమర్థిస్తున్నారు.
- ‘‘మరి బట్టర్ చికెన్ ఐస్ క్రీమ్ కదా తియ్యగా ఉంటుందా? స్పైసీగా ఉంటుందా..’’, ‘‘స్పైసీగా ఉంటే మాత్రం బాగున్నట్టే..’, ‘ఇదేం ప్రయోగమో.. అన్నీ పిల్ల చేష్టలు’ అని ఇంకొందరు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు.
- ‘ఏదేమైనా ఈ మధ్య ఇలాంటి కొత్త ప్రయోగాలు పెరిగిపోయాయి. వంటలను మర్డర్ చేసేస్తున్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్ ను, బట్టర్ చికెన్ ను రెండింటినీ మర్డర్ చేసేశారు..’.. అంటూ కొందరు భిన్నంగా స్పందిస్తున్నారు.