శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్ లలిత్... రాత్రి గరుడ సేవకు హాజరుకానున్న వైనం
- తిరుమల చేరుకున్న సీజేఐ జస్టిస్ లలిత్
- ఆలయ మహాద్వారం వద్ద స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్, ఈవో
- ఈ రాత్రికి గరుడ సేవలో పాల్గొననున్న జస్టిస్ లలిత్
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం తిరుమల చేరుకున్నారు. సీజేఐ హోదాలో తొలిసారి తిరుమలకు వచ్చిన జస్టిస్ లలిత్‌కు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ లలిత్ ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు.
ప్రస్తుతం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన పున్నమి గరుడ సేవ శనివారం రాత్రి జరగనుంది. స్వామి వారి గరుడ సేవలో జస్టిస్ లలిత్ పాల్గొననున్నారు.
ప్రస్తుతం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన పున్నమి గరుడ సేవ శనివారం రాత్రి జరగనుంది. స్వామి వారి గరుడ సేవలో జస్టిస్ లలిత్ పాల్గొననున్నారు.