హెల్త్ క్రెడిట్ కార్డులతో లాభం ఉందా..?
- అత్యవసర సమయాల్లో చెల్లింపుల పరంగా వెసులుబాటు
- ఏటా ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్
- సాధారణ కార్డుల మాదిరే గ్రేస్ పీరియడ్
అత్యవసరంగా హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, మీరు వెళ్లిన హాస్పిటల్ కు క్యాష్ లెస్ సదుపాయం లేదు. అలాంటి సమయాల్లో హెల్త్ క్రెడిట్ కార్డ్ ఆదుకుంటుంది. హెల్త్ క్రెడిట్ కార్డు లేనివారికి.. ఆస్పత్రుల సిబ్బంది ఇప్పుడు ఈ తరహా కార్డుల గురించి వివరించి వాటిని విక్రయిస్తున్నారు.
అత్యవసర సమయాల్లో హెల్త్ కేర్ సదుపాయాలను పొందేందుకు వీలుగా అవతరించినవే హెల్త్ క్రెడిట్ కార్డులు. సాధారణ క్రెడిట్ కార్డులు, వీటికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. హెల్త్ క్రెడిట్ కార్డులపై ఏడాదికోసారి ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆన్ లైన్ వీడియో డాక్టర్ కన్సల్టేషన్, ఆన్ లైన్ ప్రిస్కిప్షన్, మెడిసిన్స్ డెలివరీ సేవలు లభిస్తాయి.
యాక్సిస్ బ్యాంకు, ఎస్ బీఐ, యస్ బ్యాంకు ప్రస్తుతానికి ఈ తరహా కార్డులను అందిస్తున్నాయి. వీటి వార్షిక ఫీజు రూ.749 నుంచి రూ.2,999 వరకు ఉంది. కొన్ని హెల్త్ క్రెడిట్ కార్డులు కొన్నిరకాల చికిత్సలకే చెల్లింపుల సేవలను ఆఫర్ చేస్తున్నాయి. మరికొన్ని కార్డులు అన్ని రకాల చికిత్సలకు చెల్లింపుల అవకాశాన్ని కల్పిస్తున్నాయి. సాధారణ కార్డుల మాదిరే హెల్త్ క్రెడిట్ కార్డుల్లోనూ సున్నా వడ్డీ పీరియడ్ ఉంటుంది. ఇది దాటితే కార్డు వినియోగించిన తేదీ నుంచి చార్జీ పడుతుంది. కొన్ని హెల్త్ క్రెడిట్ కార్డులు సులభ ఈఎంఐలుగా చెల్లించే సదుపాయాన్ని ఇస్తున్నాయి. కాకపోతే ఇందులో చార్జీలు, ఇతర నియమ నిబంధనలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఏదేమైనా హెల్త్ ఇన్సూరెన్స్ కు మరేదీ సాటి రాదు.