బహిరంగంగా ప్రజలకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ... కారణం ఇదే!
- నిన్న రాజస్థాన్‌లోని సిరోహిలో బహిరంగ సభకు ఆలస్యంగా వచ్చిన మోదీ
- రాత్రి పది దాటడంతో లౌడ్ స్పీకర్ రూల్స్ పాటించిన ప్రధాని
- సభలో మాట్లాడనందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పి.. మళ్లీ వస్తానని మాటిచ్చిన మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఓ బహిరంగ సభలో ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆ సభలో మాట్లాడకుండా వెళ్లిపోయారు. తన కోసం వచ్చిన వేలాది మంది అభిమానుల కోసం మోకాళ్లపై కూర్చొని అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని ఇలా చేయడానికి బలమైన కారణమే ఉంది.
శుక్రవారం అహ్మదాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ అనంతరం రాజస్థాన్‌లో పర్యటించారు. ప్రధాని మోదీ రోజంతా బిజీబిజీగా గడిపారు. ఈ నేపథ్యంలో సిరోహిలోని అబు రోడ్ ప్రాంతంలో జరిగిన సభకు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే సమయం రాత్రి 10 గంటలు దాటింది. అయినా మోదీ కోసం వేలాది మంది సభలో ఉన్నారు. కానీ, రాజస్థాన్‌లో 10 తర్వాత లౌడ్ స్పీకర్స్ ఉపయోగించకూడదన్న నిబంధనలు అమలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మోదీ తాను కూడా నిబంధనలు పాటించాలని నిర్ణయించుకున్నారు.
దాంతో, స్పీకర్స్, మైక్ వాడకుండా వేదికపై మాట్లాడారు. సభలో తాను ప్రసంగించలేకపోయినందుకు సభకు ముందు క్షమాపణలు చెప్పారు. మళ్లీ సిరోహికి వస్తానని హామీ ఇచ్చారు. "నేను సభకు చేరుకోవడానికి ఆలస్యమైంది. రాత్రి 10 గంటలైంది కాబట్టి నిబంధనలను పాటించాలని నా మనస్సాక్షి చెబుతోంది. మాట్లాడలేకపోతున్నందుకు మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నా. అయితే, నేను మళ్ళీ ఇక్కడికి వస్తా. నాపై మీరు ఏంతో ప్రేమ చూపారు. అంతకంటే రెట్టింపు ప్రేమను మళ్లీ మీకు తిరిగి ఇస్తానని మాటిస్తున్నా" అని మోదీ పేర్కొన్నారు. అనంతరం భారత్ మాతాకీ జై నినాదాలు చేసిన ప్రధాని.. మోకాళ్లపై కూర్చొని ప్రజలకు రెండు చేతులు జోడించి ప్రజలకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.