హైదరాబాద్ లో 5జీ సేవలు త్వరలోనే
- ముందుగా ప్రారంభమయ్యే పట్టణాల్లో భాగ్యనగరానికీ చోటు
- పట్టణాల్లోనూ కొన్ని ప్రాంతాలకే ఆరంభంలో సేవలు
- దేశవ్యాప్త విస్తరణకు మరో రెండేళ్ల సమయం
ఎప్పుడెప్పుడు 5జీ సేవలను వినియోగించుకుందామా? అని ఆసక్తిగా చూస్తున్న వారు కొంత కాలం పాటు వేచి చూడక తప్పదు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు 5జీ సేవలను అధికారికంగా ప్రారంభించారు. రిలయన్స్ జియో ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై పట్టణాల్లో ఈ దీపావళికి 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పట్టణాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని అనుకోవద్దు. టెలికం ఆపరేటర్ల 5జీ సేవలు కేవలం ఎంపిక చేసిన పట్టణాల్లోని కొన్ని ప్రాంతాలకే ఆరంభంలో పరిమితం అవుతాయి. ఆ తర్వాత క్రమంగా ఇవి మరిన్ని ప్రాంతాలకు అందుబాటులోకి వస్తాయి.
జియో అయినా, ఎయిర్ టెల్ అయినా ముందుగా కొన్ని ప్రముఖ పట్టణాల్లో, అది కూడా కేవలం కొన్ని ప్రాంతాలకే ప్రయోగాత్మక సేవలను పరిమితం చేయనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం.. ముందుగా 5జీ సేవలు హైదరాబాద్ తోపాటు ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, గాంధీ నగర్, గురుగ్రామ్, జామ్ నగర్, లక్నో, పుణె లో ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం 4జీ మాదిరిగా దేశవ్యాప్తంగా 5జీ సేవలను ఆస్వాదించాలంటే కనీసం రెండేళ్లు అయినా పట్టొచ్చన్నది అంచనా.