షావోమీకి చెందిన రూ.5,551 కోట్ల ఆస్తుల జప్తును ధృవీకరించిన కాంపిటెంట్ అథారిటీ
- ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు షావోమీపై కేసు నమోదు చేసిన ఈడీ
- ఏప్రిల్‌లోనే ఆ సంస్థకు చెందిన రూ.5,551 కోట్ల ఆస్తుల జప్తు
- జప్తును ధృవీకరిస్తూ కాంపిటెంట్ అథారిటీ ఉత్తర్వులు
చైనా మొబైల్ తయారీ సంస్థ మేకర్ షావోమీకి శుక్రవారం భారీ షాక్ తగిలింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఇదివరకే షావోమీపై కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ సంస్థకు చెందిన రూ.5,551.27 కోట్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సీజింగ్ ఆర్డర్‌ను కాంపిటెంట్ అథారిటీ శుక్రవారం ధ్రువీకరించింది. దేశంలో ఇప్పటికి వరకు ఈడీ సీజ్ చేసిన అతిపెద్ద మొత్తం ఇదే కావడం గమనార్హం.
ఈడీ సీజ్ చేసిన మొత్తానికి సమానమైన విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ నుంచి అనధికారిక పద్ధతిలో షావోమీ దేశం దాటించిందని ఈడీ ఆరోపించింది. ఇదే విషయాన్ని కాంపిటెంట్ అథారిటీకి ఇదివరకే ఈడీ తెలిపింది. దీనిని పరిశీలించిన కాంపిటెంట్ అథారిటీ ఈ మొత్తాన్ని సీజ్ చేయడం సరైన నిర్ణయమేనని స్పష్టం చేసింది.ఫెమా నిబంధనలను షావోమీ దారుణంగా ఉల్లంఘించినట్టు కాంపెటెంట్ అథారిటీ ఈ సందర్భంగా పేర్కొంది.