ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 125 సీట్లు: మాజీ ఎంపీ రాయపాటి
- గుంటూరు ఉమ్మడి జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ
- వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమన్న మాజీ ఎంపీ రాయపాటి
- టీడీపీ పొత్తులపై చంద్రబాబుదే నిర్ణయమని వ్యాఖ్య
- ఎన్నికల్లో తన పోటీపై చంద్రబాబే నిర్ణయం తీసుకుంటారని వెల్లడి
2024 ఎన్నికలకు సంబంధించి టీడీపీ నేత, నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 125కు పైగా స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ పొత్తుల విషయంలో అంతిమ నిర్ణయం చంద్రబాబుదేనని కూడా ఆయన తేల్చి చెప్పారు.
గుంటూరు ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలతో శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా యూనిట్‌గా నేతలంతా సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి హాజరైన రాయపాటి.. మీడియాతో మాట్టాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అంతేకాకుండా ఎన్నికల్లో తాను పోటీ చేయాలో, వద్దో చంద్రబాబే నిర్ణయిస్తారని కూడా ఆయన తెలిపారు.