'కండోమ్' వ్యాఖ్యలపై క్షమాపణలు కోరిన ఐఏఎస్ అధికారిణి

  • బీహార్ లో విద్యార్థినులతో వర్క్ షాప్
  • తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్
  • అధికారిణిపై ఒక్కసారిగా వెల్లువెత్తిన విమర్శలు
  • వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానంటూ అధికారిణి ప్రకటన
బీహార్ లో విద్యార్థినులతో ఓ వర్క్ షాప్ సందర్భంగా ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ బమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఉచితంగా వస్తాయంటే అమ్మాయిలు కండోమ్ లు కూడా కావాలంటారేమో అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తనపై తీవ్ర విమర్శలు రావడంతో సదరు ఐఏఎస్ అధికారిణి స్పందించారు. 

కండోమ్ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. తాను ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఆ వర్క్ షాప్ లో ఏ ఒక్క అమ్మాయి అయినా నా వ్యాఖ్యల పట్ల నొచ్చుకుని ఉంటే అందుకు చింతిస్తున్నానని హర్జోత్ కౌర్ బమ్రా పేర్కొన్నారు. ఈ మేరకు మూడు పేజీలతో ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలను పత్రికల్లో మరో కోణంలో ప్రచురించారని ఆమె ఆరోపించారు.


More Telugu News