ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్.. ఈ పిల్లల వీడియో చూస్తే తెలుస్తుంది..!
- అదిరే డ్యాన్స్ తో ఫుట్ బాల్ ప్రపంచకప్ కు స్వాగతం పలికిన చిన్నారులు
- వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- భారీగా ఖర్చుతో చేసిన ప్రకటనలు కూడా దీని ముందు తేలిపోతాయన్న అభిప్రాయం
ఫిఫా వరల్డ్ కప్ ఆరంభానికి ముందే ఫుట్ బాల్ ప్రేమికుల సందడి మొదలైంది. ఖతార్ లో నవంబర్ లో ఈ భారీ క్రీడా సంరంభం మొదలు కానుంది. ఫిఫా వరల్డ్ కప్ ఉత్సాహం ఏ స్థాయిలో ఉంటుందో తెలియజేసేలా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ పేజీలో ఓ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోలో పిల్లలు ఫిఫా వరల్డ్ కప్ కు స్వాగతం పలుకుతూ.. ఫుట్ బాల్ ఆడుతూ చక్కని డ్యాన్స్ లతో అదరగొట్టారు. భారీ ఖర్చుతో ఫిఫా లేదా ఖతార్ ప్రభుత్వం రూపొందించిన భారీ ప్రచార వీడియోలు కూడా ఈ తరహా సింపుల్ వీడియో తీసుకొచ్చినంత ఉత్సాహాన్ని ఇవ్వలేవన్న అభిప్రాయాన్ని ఆనంద్ మహీంద్రా వ్యక్తం చేశారు.
‘‘ఫిఫా అండ్ ఖతార్.. వరల్డ్ కప్ కు సంబంధించి ప్రచార ప్రకటనలు, వీడియోల కోసం మిలియన్ల కొద్దీ ఖర్చు చేశాయి. ఫుట్ బాల్ అంటే ఏంటో ప్రపంచానికి చెప్పేలా, చౌకగా, చీర్ ఫుల్ గా ఉన్న ఈ వీడియో ఇచ్చినంత ఉత్సాహాన్ని అవి ప్రజల్లో నింపలేవన్నది నా అభిప్రాయం’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.