త్రీడీలో రానున్న సమంత ‘శాకుంతలం‘.. అందుకే విడుదల వాయిదా!
- గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణిక చిత్రం
- ముందుగా నవంబర్ 4న రిలీజ్ చేయాలనుకున్న గుణశేఖర్
- త్రీడీ కోసం సమయం పట్టడంతో విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటన
సమంత కథానాయికగా నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. శకుంతల-దుష్యంతుడి ప్రేమకథను ఇందులో చూపెట్టనున్నారు. దుష్యంతుడిగా దేవ్‌మోహన్ నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 4న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం విడుదలను వాయిదా వేసినట్టు తెలిపారు.
చిత్రాన్ని త్రీడీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని గుణశేఖర్ చెప్పారు. త్రీడీ కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి ముందుగా అనుకున్న సమయంలో చిత్రాన్ని విడుదల చేయలేమని చెప్పారు. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. ప్రేక్షకులకు అద్భుతమైన వీక్షణానుభూతిని అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. సినిమా జ్ఞాపకాల్ని చిరకాలం భద్రపరచుకోవాలనే ఆలోచనతో త్రీడీలో అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, ప్రకాష్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు.