భారత్ జోడో యాత్రలో తన మోకాలి నొప్పి ఎలా మాయమవుతోందో చెప్పిన రాహుల్ గాంధీ
- కేరళలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర
- పార్టీ సీనియర్లతో పిచ్చాపాటిగా సంభాషించిన రాహుల్ గాంధీ
- మోకాలి నొప్పి తనను ఇబ్బంది పెడుతోందని వెల్లడి
- నొప్పి ఇట్టే మాయమైపోతోందన్న రాహుల్
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని కన్యాకుమారి వద్ద ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పార్టీకి చెందిన సీనియర్ నేతలతో గురువారం పిచ్చాపాటిగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. మోకాలి నొప్పితోనూ తాను యాత్రను కొనసాగించగలుతున్నానని చెప్పారు.
యాత్రలో నడుస్తున్న సమయంలో కొన్ని సార్లు తన మోకాలి నొప్పి తీవ్రం అవుతోందని, ఫలితంగా తాను ఇబ్బంది పడుతున్నానని ఆయన చెప్పారు. అయితే తనను ఇబ్బంది పెడుతున్న మోకాలి నొప్పి క్షణాల్లో మాయమైపోతోందని కూడా రాహుల్ చెప్పారు. ఇందుకు గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. సరిగ్గా తన మోకాలి నొప్పి తీవ్రం అవుతున్న సమయంలో ఎవరో ఒకరు తన వద్దకు రావడం, తనను ఆశ్చర్యానికి గురి చేసేలా ఏదో ఒకటి చేయడం, తనకు ఏదో ఒక మాట చెప్పడంతో తన మోకాలి నొప్పి ఇట్టే మాయమైపోతోందని రాహుల్ చెప్పారు.