గుజరాత్ లో 36వ జాతీయ క్రీడలు ప్రారంభించిన ప్రధాని మోదీ

  • ఏడేళ్ల తర్వాత దేశంలో జాతీయ క్రీడలు
  • 2015లో చివరిసారిగా నేషనల్ గేమ్స్
  • ఆ తర్వాత వివిధ కారణాలతో జాతీయ క్రీడలకు గ్రహణం
  • ఈసారి గుజరాత్ కు జాతీయ క్రీడల నిర్వహణ చాన్స్
  • గుజరాత్ లోని ఆరు నగరాల్లో జాతీయ క్రీడా పోటీలు
భారత్ లో మళ్లీ జాతీయ క్రీడల సంరంభం అభిమానులను అలరించనుంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. 36వ జాతీయ క్రీడలను ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నేడు ప్రారంభించారు. గుజరాత్ లోని 6 నగరాల్లో జాతీయ క్రీడలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 12 వరకు ఈ క్రీడోత్సవం జరగనుంది. 

చివరిసారిగా 35వ జాతీయ క్రీడలు కేరళలో 2015లో నిర్వహించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో జాతీయ క్రీడల నిర్వహణ సాధ్యం కాలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత జాతీయ క్రీడలకు మోక్షం కలిగింది. 36వ జాతీయ క్రీడల నిర్వహణ అవకాశాన్ని కేంద్రం గుజరాత్ కు అప్పగించింది. 36 క్రీడాంశాల్లో ఈ పోటీలు జరగనున్నాయి.


More Telugu News