ఏపీలో టీచ‌ర్లు సంతోషంగానే ఉన్నారు!... హ‌రీశ్ రావు వ్యాఖ్య‌ల‌కు కౌంట‌రిచ్చిన బొత్స!

  • ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్రభుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న హ‌రీశ్ రావు
  • హ‌రీశ్ వ్యాఖ్య‌లపై వేగంగా స్పందించిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
  • పీఆర్సీల‌ను ప‌రిశీలిస్తే తేడా తెలుస్తుంద‌ని వ్యాఖ్య‌
  • హ‌రీశ్ రావు వాస్త‌వాలు తెలుసుకుని మాట్లాడాల‌ని హిత‌వు
ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్ర‌భుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటుగా స్పందించారు. వాస్త‌వాలేమిటో తెలుసుకోకుండా హ‌రీశ్ రావు మాట్లాడ‌టం స‌రికాద‌ని బొత్స అన్నారు. ఈ మేర‌కు హ‌రీశ్ రావు వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ బొత్స ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నార‌ని బొత్స అన్నారు. హ‌రీశ్ రావు ఒకసారి ఏపీకి రావాల‌ని, ఇక్క‌డి టీచ‌ర్ల‌తో మాట్లాడి వాస్త‌వాలు తెలుసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. తెలంగాణ‌, ఏపీ పీఆర్సీలు ప‌క్క‌ప‌క్క‌నే ‌పెట్టుకుని చూస్తే తేడా తెలుస్తుంద‌ని బొత్స వ్యాఖ్యానించారు. అయినా హ‌రీశ్ రావు త‌మ ప్ర‌భుత్వంపై మాట్లాడి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని బొత్స అన్నారు.


More Telugu News