నిత్యజీవితంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే విష పదార్థాలు ఇవే!
- దైనందిన జీవితంలో విష పదార్థాలతో సహవాసం
- తినే తిండి, పీల్చే గాలిలో హానికర పదార్థాలు
- ప్లాస్టిక్, ఫర్నిచర్ లోనూ టాక్సిన్లు
- అనేక రకాల రుగ్మతలకు ఈ టాక్సిన్లే కారణం
- క్రోమోజోములపైనా ప్రభావం
మన దైనందిన జీవితంలో మనకు తెలియకుండానే ఎన్నో హానికర రసాయనాల ప్రభావాలకు గురవుతుంటాం. అసలు, వివిధ రూపాల్లో మన ఇళ్లలోనే అనేక విష పదార్థాలు ఉంటాయి. దుస్తులు, వంటగది, ఫర్నిచర్, ఆహారం, గాలి.... ఇలా అనేక రూపాల్లో విష పదార్థాలు మన చుట్టూ ఉంటాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, క్లీనింగ్ లిక్విడ్లు, పెర్ఫ్యూమ్ లు, కాస్మెటిక్స్... ఇవన్నీ కూడా హానికర రసాయనాలతో కూడినవే. ఇక, ఎక్కడ ఎలాంటి విష పదార్థాలు ఉంటాయో ఓసారి చూద్దాం!
1. దుస్తులు...
దుస్తుల్లో డీడీటీ, డీడీఈ వంటి పురుగుమందుల అవశేషాలు ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో అల్జీమర్స్ రుగ్మతకు కారణమవుతాట.
అంతేకాదు, స్పోర్ట్స్ బ్రా, యోగా పాంట్స్, జిమ్ దుస్తుల్లో ఉండే కాడ్మియం, లెడ్, పాదరసం వంటి భారలోహాలు సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపించడమే కాకుండా, థైరాయిడ్, క్యాన్సర్ కు కూడా దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియలకు కీలకం అనదగ్గ హైపోథాలమస్ పిట్యూటరీ అడ్రెనల్ యాక్సిస్ (హెచ్ పీఏ యాక్సిస్) పైనా ప్రభావం చూపిస్తుంది.
2. కిచెన్...
వంటగదిలో అనేక ప్లాస్టిక్ వస్తువులు వాడుతుంటాం. ఈ ప్లాస్టిక్ వస్తువుల్లో బిస్ఫెనాల్ ఏ అనే రసాయనం ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. బిస్ఫెనాల్ ఏ వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. చిన్నారుల్లో ఆటిజం ముప్పును మూడింతలు చేస్తుంది.
ఇది కూడా హెచ్ పీఏ యాక్సిస్ ను దెబ్బతీస్తుంది. తద్వారా అమ్మాయిల్లో యుక్తవయస్సు, అండాల విడుదల, ఫలదీకరణం వంటి హార్మోన్ ఆధారిత ప్రక్రియల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయి.
3. ఫర్నిచర్...
ఫర్నిచర్ ఎక్కువగా కలపతో తయారుచేస్తారని తెలిసిందే. అగ్నిప్రమాదానికి గురికాకుండా ఉండేందుకు ఫర్నిచర్ కు కొన్ని అగ్నిమాపక రసాయనాలు పూస్తారు. వీటిని పాలీక్లోరినేటెడ్ బైఫెనిల్స్ అంటారు. ఇవి మెదడులో డోపమైన్ వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా పార్కిన్సన్ వ్యాధి బారినపడే ముప్పును కలిగిస్తాయి.
ఇక, ఫర్నిచర్ తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్ లో థాలేట్స్ అనే రసాయనాలు ఉంటాయి. వీటి వల్ల ఏకాగ్రత నిలపలేకపోవడం, ఆటిజం, మాటలో తడబాటు, ఎదుగుదల ఆలస్యం కావడం, నలుగురిలో కలవలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
4. ఆహారం...
మనం నిత్యం అనేక రకాల ఆహార పదార్థాలు స్వీకరిస్తాం. వాటిల్లోనూ వివిధ రూపాల్లో విష పదార్థాలు పొంచి ఉంటాయి. చేపలు, నత్తలు, మాంసం, చికెన్, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం, ఇతర ధాన్యాల్లో ఆర్సెనిక్ ఉంటుంది. ఇక, కాల్చిన ఆహారంలో అడ్వాన్స్ డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ (ఏఈజీఎస్) ఉంటాయి.
ఫంగి, ఆహార శీతలీకరణ కోసం ఉపయోగించే నైట్రోజన్, గ్లైఫోసేట్ (కలుపుమందు), క్లోరోపైరిఫాస్ (పురుగుమందు)... ఇవన్నీ ఆహార పదార్థాలను అంటిపెట్టుకుని ఉంటాయి. ఆహార పదార్థాలకు జోడించే నైట్రోజన్ ప్రమాదకర నైట్రోజమైన్ గా రూపాంతరం చెందుతుంది. ఇది అల్జీమర్స్, డయాబెటిస్, ఫ్యాటీ లివర్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఆర్గానిక్ ఆహారం తీసుకుంటే కలుపు, పురుగుమందుల అవశేషాల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. కానీ, ఆర్గానిక్ ఫుడ్ పై బూజు, భారలోహాలు, ఇతర బయోటాక్సిన్లు, ప్లాస్టిక్ ప్రభావం పడుతుంది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.
5. గాలి...
నిత్యం పీల్చే గాలిలో ఉండే విషపదార్థాలకు తక్కువ లేదు. దుమ్ము ధూళి, పొగ, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం, లెడ్, మాంగనీస్, పాదరసం, నికెల్ వంటి భార లోహాలు, బెంజీన్, డయాక్సిన్, ఆస్బెస్టాస్, టోల్యూన్ వంటి పదార్థాలు మనం పీల్చే గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
నాడీ వ్యవస్థ దెబ్బతినడం, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి స్ట్రోక్ సంభవించడం, అల్జీమర్స్, పార్కిన్సన్ రుగ్మతలు సంభవిస్తాయి. పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్ల వద్ద బెంజీన్ వాసన పీల్చడం వల్ల క్రోమోజోముల ఉత్పరివర్తనం వంటి తీవ్ర లోపాలు తలెత్తుతాయి. ఇది క్యాన్సర్ కు కూడా దారితీస్తాయి.
విష పదార్థాలకు దూరంగా ఉండాలంటే...
ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ఫుడ్ కంటైనర్ల వినియోగం తగ్గించాలి. ఆర్గానిక్ ఫుడ్, జన్యు మార్పులు చేయనటువంటి పంటల నుంచి తయారైన ఆహారం తీసుకోవాలి. ఆర్గానిక్ చర్మ సౌందర్యోపకరణాలనే వినియోగించాలి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడం ఆపేయాలి. టూనా చేపలకు బదులు సాల్మన్ చేపలు తీసుకోవాలి.