రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భద్రత 'జడ్ ప్లస్' కేటగిరీకి పెంపు
- ప్రస్తుతం జడ్ కేటగిరీ భద్రతలో ముఖేశ్ అంబానీ
- గతేడాది ముఖేశ్ ఇంటి వద్ద పేలుడు పదార్థాలున్న వాహనం గుర్తింపు
- ముఖేశ్ భద్రతపై విస్తృతంగా చర్చించిన కేంద్రం
- జడ్ ప్లస్ కేటగిరీలో ముఖేశ్‌కు 55 మంది సిబ్బందితో భద్రత
భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ప్రస్తుతం జడ్ కేటగిరీ భద్రతలో ఉన్న ముఖేశ్‌కు ఇకపై జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించనున్నట్లు గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిఘా సంస్థలు ఇచ్చిన నివేదిక ప్రకారమే ముఖేశ్ భద్రతను జడ్ ప్లస్ కేటగిరీకి పెంచినట్లు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది.
గతేడాది ముంబైలోని ముఖేశ్ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ముఖేశ్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా చర్చలు జరిపింది. ఈ క్రమంలోనే ఆయన భద్రతను జడ్ ప్లస్ కేటగిరీకి పెంచాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో భాగంగా ముఖేశ్‌కు 55 మందితో భద్రత కల్పించనున్నారు. వీరిలో 10 మందికి పైగా ఎన్ఎస్‌జీ కమెండోలతో పాటు ఇతర పోలీసు అధికారులు ముఖేశ్‌కు భద్రత కల్పించనున్నారు.