జగపతిబాబు 'సింబా' నుంచి థీమ్ సాంగ్ రిలీజ్!

జగపతిబాబు 'సింబా' నుంచి థీమ్ సాంగ్ రిలీజ్!
  • జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా 'సింబా'
  • కీలకమైన పాత్రలో అనసూయ
  • సంగీత దర్శకుడిగా కృష్ణ సౌరభ్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు 
ఈ మధ్య కాలంలో అటు విలన్ గాను .. ఇటు ఇతర పాత్రలలోను జగపతిబాబు జోరు తగ్గిందని అంతా చెప్పుకుంటూ ఉండగా, ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన 'సింబా' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. సంపత్ నంది - దాసరి రాజేందర్ నిర్మించిన ఈ సినిమాకి మురళీ మనోహర్ దర్శకత్వం వహించాడు.

విభిన్నమైన కథాంశంతో .. విలక్షణమైన పాత్రలతో రూపొందిన ఈ సినిమా నుంచి ఒక థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. పర్యావరణ పరిరక్షకుడుగా జగపతిబాబు .. టీచర్ గా అనసూయ .. సైకియాట్రిస్ట్ గా గౌతమి పాత్రలను పరిచయం చేశారు. అలాగే ఒక డాక్టర్ .. జర్నలిస్ట్ పాత్రలను కూడా పరిచయం చేశారు.

 అయితే ఈ పాత్రల మేనరిజం అంతా కూడా డిఫరెంట్ గా కనిపిస్తోంది. నేపథ్యంలో ఏదో జరుగుతోంది అనే విషయం మాత్రం అర్థమయ్యేలా థీమ్ సాంగును వదిలారు. ప్రతి పాత్ర వైపు నుంచి మరో కొత్త కోణం ఉన్నట్టుగా అనిపిస్తోంది. కృష్ణ సౌరభ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది


More Telugu News