ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ పోగొట్టుకున్నాను: 'అమ్మ' రాజశేఖర్

  • తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న 'అమ్మ' రాజశేఖర్
  • 'ఖతర్నాక్'తో హిట్ అందుకున్నాను అంటూ హర్షం 
  • ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందంటూ వెల్లడి
  • నితిన్ ప్రాజెక్టు వలన ఆ ఛాన్స్ పోయిందంటూ ఆవేదన   
ప్రభుదేవా .. లారెన్స్ తరువాత కొరియోగ్రఫీ నుంచి దర్శకత్వం వైపు వెళ్లిన డాన్స్ మాస్టర్లు కొంతమంది కనిపిస్తారు. అలాంటివారి జాబితాలో 'అమ్మ' రాజశేఖర్ ఒకరు. అయితే ఆశించిన స్థాయిలో ఆయన ముందుకు వెళ్లలేకపోయాడు. అందుకు గల కారణాన్ని ఆయన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

" దర్శకుడిగా నేను చేసిన 'ఖతర్నాక్' సినిమా మంచి హిట్ కొట్టింది. దాంతో నాకు ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన పనిలో నేను ఉండగా, నాకు నితిన్ కాల్ చేశాడు. 'టక్కరి' సినిమా చేసి పెట్టమని అడిగాడు. అది ఓ తమిళ ఫ్లాప్ సినిమాకి రీమేక్. వద్దని నేను చెప్పినా వినిపించుకోలేదు. 

నితిన్ తో ఉన్న స్నేహం కారణంగా నేను ఆ సినిమాను చేశాను. నేను అనుకున్నట్టుగానే ఆ సినిమా ఫ్లాప్ అయింది. మళ్లీ నేను ప్రభాస్ ను కలవకుండా అయింది. ఆయనను కలవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నితిన్ కోసం ఒక పెద్ద సినిమా చేసే ఛాన్స్ పోగొట్టుకున్నాను. నా కెరియర్ ను నేనే పాడు చేసుకున్నట్టు అయింది" అంటూ చెప్పుకొచ్చాడు.


More Telugu News