టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ... వెన్నునొప్పితో బుమ్రా ఔట్

  • వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా
  • 6 నెలల పాటు విశ్రాంతి!
  • అక్టోబరులో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్
  • ఇప్పటికే జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా
మరికొన్నిరోజుల్లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అతడికి 6 నెలల విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. 

ఇటీవల యూఏఈలో మోకాలి గాయానికి గురైన రవీంద్ర జడేజా ఇప్పటికే వరల్డ్ కప్ కు దూరం కాగా, ఇప్పుడు బుమ్రా కూడా అదే బాటలో నడిచాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో మూడో టీ20 మ్యాచ్ లో ఆడిన బుమ్రా భారీగా పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లు విసిరి 50 పరుగులు సమర్పించుకున్నాడు. 

గాయంతో బాధపడుతుండడంతో అతడిని దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు కూడా ఎంపిక చేయలేదు. కాగా, బుమ్రా స్థానంలో వరల్డ్ కప్ కు ఎవరిని తీసుకునేది బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు.


More Telugu News