దమ్ముంటే బీహార్ లో ఆరెస్సెస్ ను నిషేధించు: లాలూకి కేంద్ర మంత్రి సవాల్

  • పీఎఫ్ఐ మాదిరి ఆరెస్సెస్ ను నిషేధించాలన్న లాలూ ప్రసాద్
  • తాను ఆరెస్సెస్ వాలంటీర్ నని చెప్పుకోవడానికి గర్వపడతానన్న గిరిరాజ్ సింగ్
  • పీఎఫ్ఐ సభ్యుడినని లాలు చెప్పుకోగలరా? అని ప్రశ్న
విద్వేషాలను రెచ్చగొట్టే అన్ని సంస్థలను నిషేధించాలని... పీఎఫ్ఐ మాదిరే ఆరెస్సెస్ ను కూడా బ్యాన్ చేయాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఆరెస్సెస్ వాలంటీర్ నని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తానని చెప్పారు. మరి పీఎఫ్ఐ సభ్యుడినని లాలూ చెప్పుకోగలరా? అని ప్రశ్నించారు. బీహార్ లో ప్రస్తుతం వారి ప్రభుత్వమే ఉందని... దమ్ముంటే ఆ రాష్ట్రంలో ఆరెస్సెస్ ను లాలూ నిషేధించాలని సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధించిన సంస్థలు ఇవే:
పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, రెహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ విమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ అండ్ రెహాబ్ ఫౌండేషన్.


More Telugu News