మైదానంలోకి దూసుకొచ్చి రోహిత్ కాళ్లు మొక్కిన అభిమాని
- తిరువనంతపురంలో నిన్న రాత్రి తొలి టీ20లో ఘటన
- భద్రతా సిబ్బంది కళ్లు గప్పి గ్రౌండ్‌లోకి వచ్చిన అభిమాని
- తొలి టీ20లో 8 వికెట్లతో భారత్ గెలుపు
భారత్‌లో క్రికెటర్లకు భారీ క్రేజ్ ఉంటుంది. కొందరు అభిమానులు వాళ్లను దేవుళ్లుగా పూజిస్తారు. క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియాలకు పోటెత్తుతారు. ఈ క్రమంలో కొందరు ఎంతో రిస్క్ చేస్తుంటారు. స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతను దాటుకొని మైదానంలోకి వచ్చి క్రికెటర్లను కలిసే ప్రయత్నం చేస్తుంటారు. ఇదివరకు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ కోసం ఫ్యాన్స్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలోకి వచ్చిన ఘటనలు ఉన్నాయి.
తాజాగా రోహిత్ శర్మ కోసం ఓ అభిమాని ఇలాంటి పనే చేశాడు. తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో గురువారం రాత్రి జరిగిన మొదటి టీ20 సందర్భంగా ఒక అభిమాని భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాదాలను తాకాడు. భారత్ ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఈ మ్యాచ్ కోసం తిరువనంతపురం వచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి అభిమానులు భారీ కటౌట్ లతో స్వాగతం పలికారు. మూడు మ్యాచ్ ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 స్కోరు మాత్రమే చేసింది. తర్వాత కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ధ సెంచరీలతో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం గువాహటిలో జరుగుతుంది.