యూరప్‌లో ప్రబలుతున్న సిఫిలిస్ వ్యాధి.. షూటింగులకు ఫుల్‌స్టాప్ పెట్టేసిన యూకే పోర్న్ స్టార్లు
- యూరప్‌లో చాపకింద నీరులా విస్తరిస్తున్న సిఫిలిస్
- తొలి దశలో చికిత్సకు దూరమైతే పెను ప్రమాదం
- శృంగారం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి
- ఆదాయాన్ని కోల్పోతున్నామన్న పోర్న్‌స్టార్లు
యూరప్‌లోని పోర్న్‌స్టార్స్‌ను సిఫిలిస్ వ్యాధి భయం వెంటాడుతోంది. లైంగిక వ్యాధి అయిన సిఫిలిస్ శృంగారం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఇది సోకిన వారి శరీరంపై గాయాలవుతాయి. దద్దుర్లు వస్తాయి. యాంటీబయాటిక్స్‌తో దీనిని నయం చేసే వీలుంది. అయితే నిర్లక్ష్యం చేస్తే మాత్రం పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే.. అంతర్గత అవయవాలు పాడవడం, మెదడు పనితీరు దెబ్బతినడం వంటివి జరుగుతాయి. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే అశ్రద్ధ చేయకుండా చికిత్స తీసుకోవాలి.
ఇక సిఫిలిస్ వ్యాధికి సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో యూకేలోని పోర్న్ స్టార్లు షూటింగులకు హాజరుకావడం మానేశారు. ప్రొడ్యూసర్లు షూటింగులు నిలిపివేశారు. దీనివల్ల పెద్ద నటులు ఆదాయం కోల్పోతున్నట్టు మాజీ పోర్న్‌స్టార్ లియానే యంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిఫిలిస్ ప్రబలుతున్న నేపథ్యంలో యూరప్‌లో హెచ్చరిక జారీ అయినట్టు పేర్కొంది. సిఫిలిస్ వ్యాధి ఆందోళనల నేపథ్యంలో షూటింగులు మానేసిన పోర్న్ స్టార్లు తమకోసం ఓ యూనియన్ ఉండాలని కోరుకుంటున్నారు.
కాగా, సిఫిలిస్ చాపకింద నీరులా ప్రబలుతున్న విషయాన్ని యూరప్‌లోని పోర్న్ స్టార్లకు తెలియజేసినట్టు యూఎస్ అడల్ట్ యాక్టర్ల కోసం లైంగిక ఆరోగ్య ధ్రువీకరణ పత్రాల డేటా బేస్‌ను నడుపుతున్న ‘పాస్’ వెల్లడించింది. అమెరికా అడల్ట్ స్టార్లతోపాటు పలువురిలో సిఫిలిస్‌ను గుర్తించినట్టు ఇది పేర్కొంది.